అర్థవీడులో స్క్రబ్ టైఫస్ పై అవగాహన
ప్రకాశం: స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అర్ధవీడులో గురువారం ఎంపీడీవో ఖాసీం పీరా,ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ పెన్నా సాగర్ ప్రజలకు అవగాహన కల్పించారు.సాధారణంగా స్క్రబ్ టైఫస్ అడవి ప్రాంతాలు, గడ్డి పొదలలో ఉండే చిన్న పురుగుల కాటుతో వస్తుందని చెప్పారు.జ్వరం, వణుకు,చర్మంపై నల్ల మచ్చలు వంటి లక్షణాలు కనపడితే ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.