'23 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు'
కోనసీమ: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన విధులకు గైర్హాజరైన 23 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు DEO పి. నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 6న సోమవారం నుంచి పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించగా.. విధులకు హాజరు కావాల్సిన 23 మంది చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు గైర్హాజరయ్యారన్నారు.