సెల్లార్ పార్కింగ్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు

సెల్లార్ పార్కింగ్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని ఓ సెల్లార్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ద్విచక్ర వాహనాల పార్కింగ్ సెంటర్‌ను మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ పార్కింగ్‌ను నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీలలో ఏసీపీ ఆశ్రిన్ భాను, టీపీవో రోజారెడ్డి పాల్గొన్నారు.