హర్మూజ్‌ను దాటిన మరో రెండు భారత నౌకలు
హర్మూజ్ జలసంధి నుంచి మరో రెండు భారత నౌకలు సురక్షితంగా దాటినట్లు కేంద్రం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. BWELM, BWTYR అనే రెండు సౌకలు 90 వేల టన్నులకుపైగా LPGని తీసుకువస్తున్నట్లు చెప్పాయి. ఇప్పటికే ఈ రెండు నౌకలు హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినట్లు వెల్లడించాయి. మరో 5 ట్యాంకర్లు, UAE సమీపంలోని జలాల్లో ఇరాన్ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నాయి.