అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం
HYD: అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో భాగంగా స్టేడియంలో ఇవాళ పంజాబ్ vs బరోడా మ్యాచ్ జరుగుతుంది. ఫ్రీ ఎంట్రీ కావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. తమ అభిమాన ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా (బరోడా), అభిషేక్ శర్మ (పంజాబ్)లను ప్రత్యక్షంగా చూసేందుకు క్రీడాభిమానులు ఉత్సాహం చూపించారు. దీంతో స్టేడియం మొత్తం నిండిపోయింది.