ఎమ్మెల్యే రాజేష్ నేటి పర్యటన వివరాలు

NGKL: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మంగళవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లిలో ఉదయం 10 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 12 గంటలకు తెలకపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ప్రారంభిస్తారు.