సీపీఎం కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

సీపీఎం కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

MDK: రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి నరసమ్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో సోమవారం నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని అన్నారు.