'ఇచ్చిన మాట నెరవేర్చాం.. డ్వాక్రా రుణాలు తీర్చాం'

కృష్ణా: ఇచ్చిన మాట నెరవేర్చామని, నాలుగు విడతల్లో ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాలు తీర్చామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. తద్వారా స్త్రీలకు ఆర్థిక స్వావలంబన కల్పించామని తెలిపారు. జిల్లాలో పర్యటించిన ధర్మాన ఆసరా పథకం నాలుగో విడత నిధుల పంపిణీలో పాల్గొన్నారు.