మొగిలిపేటలో నేడు కరెంట్ బంద్

JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేటలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అసిస్టెంట్ లైన్మెన్ విష్ణు తెలిపారు. 33KV లైన్ మరమ్మతుల దృష్ట్యా గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు వీధిదీపాలు అమర్చటం కోసం విద్యుత్ సరఫరాను నిలపనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన కరెంట్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడుతుందన్నారు.