సోషల్ మీడియా రాజకీయాలు చేయకండి: టీపీసీసీ చీఫ్
సోషల్ మీడియా ప్రచారాలను నమ్ముకుని రాజకీయాలు చేసే వారికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శాసన మండలిలో హితవు పలికారు. వందల కోట్లు ఖర్చు చేసి ఫోటోలు, ఆడియోలు మార్ఫింగ్ చేస్తే ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. సేవ, అభివృద్ధి, సంక్షేమం చేసేవారే నాయకులుగా నిలబడతారన్నారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.