'ప్రభుత్వ విధులను మాతృభాషలో నిర్వహించాలి'

'ప్రభుత్వ విధులను మాతృభాషలో నిర్వహించాలి'

VZM: ప్రస్తుత సమాజంలో మాతృభాష ప్రాధాన్యత తగ్గుతోందని, అమ్మలాంటి తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని నవ్యాంధ్ర గ్రంథాలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ. షణ్ముఖరావు, ఈపు విజయ్ కుమారులు అన్నారు. మాతృభాష దినోత్సవ సందర్భంగా శనివారం జిల్లా ప్రజా గ్రంథాలయంలో తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురు కవులను, రచయితలను సత్కరించారు.