మాగేచెరువులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సత్యసాయి: సోమందేపల్లి మండలం మాగేచెరువు పంచాయతీలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని సర్పంచ్ నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి – ఎన్టీఆర్ అమరహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.