ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ

SRPT: మద్దిరాల మండలం కుక్కుడంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బోనం కుండలను వేపాకులు, పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించారు. అనంతరం బోనాలను ఎత్తుకొని డప్పుచప్పుల మధ్య ఊరేగింపుగా ముత్యాలమ్మ దేవాలయాలకు చేరుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి, నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.