VIDEO: బస్సులో కొరతతో అవస్థలు
ప్రకాశం: పొన్నలూరు మండలం రాజోలపాడు గ్రామస్తులు బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వ్యక్తిగత పనుల మీద కొండపివైపు వెళ్లేందుకు సరైన బస్సులు లేక గంటల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి నెలకొందని మహిళలతోపాటు గ్రామస్తులు చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెంచి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.