'పూడికతీత పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి'

BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టవాగు, కోడిపుంజుల వాగు పూడికతీత పనులలో జరిగిన అవకతవకాలపై కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘం జిల్లా నాయకురాలు దుర్గ మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నాణ్యతలేని పనులు నిర్వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగ పరచిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.