'విద్యార్థులు పఠన అలవాటు పెంపొందించుకోవాలి'

NRML: నిర్మల్ రూరల్ మండల కొండాపూర్ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి డి.భోజన్న గురువారం సందర్శించారు. విద్యార్థులు తొలిమెట్టు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని, పఠన అలవాటు పెంపొందించుకోవాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులు ఇప్పటినుంచే పరీక్షలకు సిద్ధమై ప్రత్యేక ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని వారు సూచించారు.