VIDEO: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లెకు చెందిన ప్రతాప్ (45) అనే భవన కార్మికుడు, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్యంతో పనిచేయలేకపోవడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించిందని సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.