రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
KDP: మైదుకూరు మున్సిపాలిటీ 18వ వార్డు రోడ్డుకు రూ.18 లక్షల నిధులు మంజూరు చేయించి, గురువారం ఆ రోడ్డు నిర్మాణ పనులకు MLA పుట్టా సుధాకర్ భూమిపూజ చేశారు. రోడ్డు దుస్థితిపై స్థానికుల ఫిర్యాదుకు వెంటనే స్పందించి పనులు ప్రారంభించినందుకు ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వీధిలో రోడ్లు, తాగునీరు, వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడం తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.