మినీ బ్లడ్ క్యాంప్ విజయవంతం
ASR: పాడేరు మాతా శిశు ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో సోమవారం ఎస్.హెచ్.జే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత, రక్తదాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం 30 మంది రక్తదానానికి ముందుకు రాగా, పరీక్షల అనంతరం 16 మంది రక్తదానం చేశారు.