ముంజెల కోసం వెళ్లి బాలుడి మృతి

ముంజెల కోసం వెళ్లి బాలుడి మృతి

SRPT: పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురంలో విషాదం నెలకొంది. నిఖిల్ అనే బాలుడు తాటి ముంజల కోసం చెట్టు ఎక్కేందుకు యత్నించగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. సరదాగా వెళ్లిన బాలుడు విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కళ్లముందే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.