'దశాబ్దాల నాటి కల మోదీతో సాకారం'

వికారాబాద్: దశాబ్దాలనాటి కలను ప్రధాని మోదీతో సాకారం అయ్యిందని బీజేపీ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడు శంకర్ అన్నారు. ఇవాళ పెద్దేముల్ మండల పరిధిలోని జనగాంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో వచ్చిన అయోధ్య రామాలయ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. అయోధ్యలో శ్రీ భవ్యమైన రాములోరి దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు.