'గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

'గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

BHNG: పాటిమట్ల గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సీపీఎం పార్టీ పిలుపులో భాగంగా పాటిమట్ల గ్రామంలో నిర్వహించిన సర్వేలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గ్రామపంచాయితీ కార్యదర్శి వెంకటేశంకి గ్రామ శాఖ వినతిపత్రం అందజేశారు.