బడ్జెట్‌పై బీఆర్ఎస్ ధ్వజం
SRPT: కాంగ్రెస్ బడ్జెట్ ‘దోచుకో.. పంచుకో’ అన్నట్లుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. ఇవాళ సూర్యాపేటలో మాట్లాడుతూ.. బీసీలకు రూ.20 వేల కోట్లు ప్రకటించి రూ.12 వేల కోట్లే కేటాయించారని, గ్యారంటీలకు నిధుల్లేవని మండిపడ్డారు. రైతు భరోసా, మహిళా సాయాన్ని విస్మరించిన ఈ మోసపూరిత బడ్జెట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.