SFI నాయకుల ముందస్తు అరెస్ట్
RR: SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా SFI షాద్ నగర్ డివిజన్ కమిటీసభ్యులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. SFI RR జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.