జాగృతి నవీపేట్ మండల కన్వీనర్‌గా కేశనోల్ల పీతాంబర్
NZB: క్షేత్రస్థాయిలో తెలంగాణ జాగృతి కార్యవర్గ ఏర్పాట్లలో భాగంగా నవీపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన కేశనోల్ల పీతాంబర్ నవీపేట్ మండల అధ్యక్షుడుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం నియమించారు. జాగృతి లక్ష్యాలకు అంకితమై శక్తివంచన లేకుండా కృషి చేయాలని వారికి సూచించారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపారు.