పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకీ..?

పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకీ..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్, వెంకీ కాంబినేషన్‌లో ఇప్పటికే ఒక పాటను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.