కాణిపాకంలో నేడు ఆర్జిత సేవలు రద్దు
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం అన్నాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు.