కేయాన్ష్ చికిత్సకు బాలకృష్ణ విజ్ఞప్తి
SS: నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనలో లేపాక్షి గ్రామానికి చెందిన చిన్నారి కేయాన్ష్ ఆద్విక్ పరిస్థితిపై స్పందించారు. ఈ బాబు SMA-2 వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు అని తెలిపారు. కుటుంబం అంత భారీ మొత్తాన్ని సమకూర్చలేనందున ప్రజలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.