'మున్సిపల్ పరిధిలో కొత్త ఫించన్లు మంజూరు'

'మున్సిపల్ పరిధిలో కొత్త ఫించన్లు మంజూరు'

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆగష్టు నెల‌ నుంచి కొత్తగా 354 మందికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు మంజూరైనట్లు కమిషనర్‌ పి. నల్లనయ్య గురువారం తెలిపారు. ఈ మేరకు నేటి నుంచి కొత్త ఫించన్లు అందజేస్తామన్నారు. 354 మంది వితంతువులకు రూ.14,16,000 మొత్తాన్ని అందించనున్నట్లు చెప్పారు. 61 సచివాలయాల పరిధిలో మొత్తం పింఛన్ల లబ్ధిదారులు 22,848 మంది ఉన్నారన్నారు.