జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారిగా లోకేశ్వరరావు
అల్లూరి జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎంవీఎస్ లోకేశ్వరరావు సోమవారం పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఆయన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్డీవోగా పూర్తి బాధ్యతలను చేపట్టారు. అనంతరం కలెక్టర్ నిశాంతిని కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.