'యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం'

JGL: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలరెడ్డి ఆరోపించారు. ఆదివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ.. వరి నాట్లు వేసే సమయంలో తెలంగాణలో రైతులు ఎక్కువగా యూరియా వాడుతారని, ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే పంపడం లేదన్నారు.