VIDEO: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు తెలిపారు. అందులో కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.