జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికలకు 27వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుందని, వెబ్‌కాస్టింగ్ వంటి ఏర్పాట్లు కూడా చేశామని అన్నారు.