'దళితుల భూముల్లో డ్రైనేజీ నిర్మాణం సరికాదు'
SRPT- కోదాడ పట్టణ పరిధిలోని అనంతగిరి రోడ్డు చెరువు సమీపంలో మున్సిపాలిటీ అధికారులు దళితుల భూముల్లో, డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం సరికాదని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షులు చింతాబాబు మున్సిపల్ అధికారులను కోరారు. మంగళవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మేనేజర్ ను కలిసి సమస్యను వారికి వివరించి వినతిపత్రాన్ని అందజేశారు.