వైసీపీ తప్పిదంతో రోడ్డున పడ్డారు: పాండురంగస్వామి

ASR: వైసీపీ తప్పిదంతో నేడు గిరిజన నిరుద్యోగులు రోడ్డున పడ్డారని టీడీపీ ముంచంగిపుట్టు మండలం దారెళ్ళ పంచాయతీ సర్పంచ్ పాండురంగస్వామి ధ్వజమెత్తారు. ప్రత్యేక డీఎస్సీ సాధన కోసం గిరిజన సంఘాలు రాష్ట్ర మన్యం బంద్ జరుగుతుంటే వైసీపీ నేతలు జి.ఓ-3 కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు తీయలేదని తెలిపారు.