డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సునీత కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సులో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు తమ పరిశోధనలను ప్రజెంటేషన్ల రూపంలో ప్రదర్శిస్తారని సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ తెలిపారు.