లోకేష్ సీఎంగా ట్రైనింగ్ అవుతున్నారు: అంబటి
AP: మంత్రి నారా లోకేష్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. లోకేష్ విద్యా, ఐటీ శాఖలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సీఎంగా ట్రైనింగ్ అవుతున్నారని ఎద్దేశా చేశారు. ఆదాయం ఉన్న శాఖల్లో వేలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారని విమర్శించారు. చిన్న వయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తారని దుయ్యబట్టారు.