చెర్లపాలెం సర్పంచ్ కీలక నిర్ణయం.. హెల్మెట్ ధరిస్తేనే ఎంట్రీ
MHBD: తొర్రూరు మండలం చెర్లపాలెంలో కొత్త రూల్ అమలవుతోంది. గ్రామ సర్పంచ్ మహేందర్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరిస్తేనే గ్రామంలోకి ఎంట్రీ అనే నిబంధన కొనసాగుతోంది. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ప్రాణాల రక్షణకై ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సహకరించాలని కోరారు. ఈ మేరకు ఎస్సై ఉపేందర్ చేతుల మీదుగా పలువురికి హెల్మెట్స్ అందించారు.