నూతన అంగన్వాడి భవనాలకు నిధుల మంజూరు

నూతన అంగన్వాడి భవనాలకు నిధుల మంజూరు

SDPT: దుబ్బాక నియోజకవర్గంలో నూతన అంగన్వాడి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాలు లేక ఇబ్బందులు ఎదురవడంతో ఉపాధి హామీ పథకం ద్వారా 29 అంగన్వాడి భవనాలకు రూ.2.32 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.