ఘనంగా 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుక
BDK: పోలీసు శాఖలో హోంగార్డు ఆఫీసర్స్ పనితీరు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ముందుగా శాంతి కపోతాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.