అన్నదమ్ములను వరించిన అవార్డులు

అన్నదమ్ములను వరించిన అవార్డులు

VKB: బొంరాస్‌పేట మండలం నాందార్‌పూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఒగ్గు బీరప్పకు అఖండ భారత్ కళా రత్న- 2025 అవార్డు, ఒగ్గు శివకు పద్మజ్యోతి-2025 అవార్డు వరించింది. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ఎన్నో ప్రదర్శనలు చేసి, ఎంతోమంది యువతకు ఒగ్గుడోలు శిక్షణ నిర్వహించినందుకు గాను రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి అవార్డులు అందుకున్నారు.