VIDEO: కబడ్డీ పోటీల కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
E.G: బిక్కవోలు మండలం పందలపాకలో జనవరి 13 14 15 తేదీల్లో జరిగే PKL-5 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల కరపత్రాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. పందలపాక యువత ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.