సాగులో దూసుకెళ్తున్న డ్రోన్లు.!
NLR: సాగులో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ఖర్చులు భారంగా మారుతున్న సమయంలో RKVY పథకం ద్వారా 5 మంది రైతుల గ్రూపులకు సబ్సిడీపై డ్రోన్లు మంజూరు చేస్తున్నారు. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేయవచ్చు. ‘ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్’ యాప్ ద్వారా RTGS చెల్లింపుతో డ్రోన్ బుక్ చేసే సౌకర్యం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది.