VIDEO: కాటేసిన పామును చంపి ఆసుపత్రికి తీసుకెళ్లాడు

VIDEO: కాటేసిన పామును చంపి ఆసుపత్రికి తీసుకెళ్లాడు

NLR: జిల్లాలో కోవూరులో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా భగత్ సింగ్ కాలనీకి చెందిన వలీ అనే వ్యక్తిని రక్తపింజరి పాము కాటేసింది. దీంతో చనిపోతానేమోనన్న భయంతో వలీ పామును చంపి స్థానిక హస్పిటల్‌కు తీసుకెళ్లాడు. పామును పట్టుకుని రావడంతో అక్కడున్న సిబ్బంది, రోగులు షాక్ అయ్యారు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.