జగ్గసాగర్‌లో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

జగ్గసాగర్‌లో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

JGL: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ పీహెచ్‌సిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుల్ల సాయగౌడ్ వైద్య సిబ్బందిని సత్కరించారు. ఉత్తమ వైద్యురాలిగా డా. తాటిపర్తి శివాని, ఉత్తమ ఏఎన్ఎంగా ప్రియదర్శిని, ఆశా కార్యకర్తలుగా మమత, రేఖకు పురస్కారాలు అందజేశారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.