'నేను బతికే ఉన్నాను'.. పుకార్లపై నెతన్యాహు సెటైర్లు

'నేను బతికే ఉన్నాను'.. పుకార్లపై నెతన్యాహు సెటైర్లు

తన మరణంపై వస్తున్న వార్తలను ఇజ్రాయెల్ PM నెతన్యాహు కొట్టిపారేశారు. 'నేను బతికే ఉన్నాను, అందుకు మీరే సాక్ష్యం' అంటూ విదేశీ మీడియాతో చమత్కరించారు. ఇరాన్ పాలకులు ఎవరో తెలియని అయోమయం నెలకొందని, మొజ్తాబా ఇంకా బాహ్య ప్రపంచానికి కనిపించలేదని పేర్కొన్నారు. ఇరాన్ సైనిక దళాల మధ్య తీవ్రమైన చీలికలు వచ్చాయని, నాయకత్వ లేమితో ఆ దేశం కొట్టుమిట్టాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.