దేశంలో LPG సమస్య తీవ్రంగా ఉంది: ఖర్గే
LPG కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. LPG సమస్య మధ్య తరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు, వాణిజ్య వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని చెప్పారు. వారు తమ వ్యాపారాలను మూయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ సంక్షోభాన్ని అదునుగా తీసుకుని దళారులు సిలిండర్లను మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు.