'వంద పడకల ఆసుపత్రిలో వసతులు కల్పించండి'
GDWL: అలంపూర్ నియోజకవర్గంలోని వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌ని కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించలన్నారు.