చీకట్లలో క్యూబా.. కుప్పకూలిన విద్యుత్తు వ్యవస్థ
అమెరికా చమురు ఆంక్షల నేపథ్యంలో క్యూబాలో చీకట్లు కమ్ముకున్నాయి. ఆ దేశ వ్యాప్తంగా విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలింది. దీంతో 1.1 కోట్ల మంది ప్రజలు విద్యుత్ లేక చీకట్లో మగ్గారు. విద్యుత్తు వ్యవస్థ నుంచి దేశం మొత్తం దూరమైందని ఆ దేశ విద్యుత్తుశాఖ మంత్రి ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.