ఎంపీడీవోను సన్మానించిన బెస్త సంఘం నాయకులు
KDP: బ్రహ్మంగారి మఠం మండలంలో నూతన ఎంపీడీవో పదవి బాధ్యతలు చేపట్టిన రామచంద్రారెడ్డిని శుక్రవారం తెదేపా నాయకుడు, బెస్త సంఘం జిల్లా నాయకుడు బోలా శ్రీను ఆధ్వర్యంలో బెస్త సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ బ్రహ్మయ్య, తుపాకుల వెంకటరమణ, శివనారాయణ, చిన్న, వెంకటరమణ, బెస్త సభ్యులు పాల్గొన్నారు.